Wednesday, December 20, 2006

విష్ణువును చూచిన పార్వతి భధ్రకాళి అవతారమెత్తెన్

ఘోర తపంబున మహాదేవు మెప్పించి,ఆత్మలింగమున్ గోరుట మరచి రావణుండు
మాయామొహితుడై జగన్మాతనే గోరి వెంటన్ గొనిపోవ యత్నింపన్,
కర్తవ్య మెరిగి ...తన మనోద్రుష్టిన్ లోకకళ్యాణమునకదంతయు జరిపించుచున్న
శ్రీ మహావిష్ణువును చూచిన పార్వతి.....భద్రకాళి అవతారమెత్తెన్!!

ఇది నిజంగా జరిగి ఉంటె అద్భుతం, కేవలం కవి కల్పనే ఐతే మహాద్భుతం .....ఏది ఏమైనా ఈ సమస్యకి ఒక చక్కని సందర్భం....అని నాకనిపించింది. (భూకైలాసం) ====Mouna manasa
===========================================

సర్వసృష్టి పై ఆధిక్యం పొందగల భీకర వరమందిన
గర్వాంధుడైన భస్మాసురుని మాయ చేసి సం హరించిన
సర్వాంగ సౌందర్య రాశి పైన తన పతి మనసుపడగా చూసి
పూర్వము వచ్చిన గంగ కు తోడు ఇంకొక సవతి బాధ
నోర్వలేక, మోహినీ రూపానున్న విష్ణువును చూచి
పార్వతీ దేవి భద్రకాళి అవతారమెత్తెన్!

- రోహిణి

===========================

క్షీర సాగర మధన సమయాన
జనించిన అమృతము కొరకై
దేవ దానవులు తగువులు పడ్తున్న వేళ
శ్రీహరి స్త్రీ రూపమును దాల్చి
అదితి సుతులకు అమృతమును పంచి
రాహు కేతులను దండించిన వైనమును
వివరిస్తూ శ్రీ మహ విష్ణువు యొక్క
జగన్మొహినీ అవతార సౌందర్యము
జగదేకమని,వనితలను సైతము
సమ్మోహితులను చేయు శక్తి గలిగినదన్న
నారదుని మాటలకు గౌరీశంకరులు
ఆశ్చర్యపడి అనంతుని మోహినీ అవతారమున
చూడవలెనన్న కుతూహలముతో,
నారాయణుని ప్రార్ధించగా.
పక్షుల కిలకిలా రావాలతో,
వాణి వీణా నాదమును తలపునకు
తెచ్చే సెలయేరుల గలగలలతో,
మనసును తాకే మలయానిలముతో,
ఆహ్లాదమును కలిగించే పచ్చికబయళ్ళతో,
సుగంధాలను వెదజల్లుతూ మనసుకు
అనురాగ ప్రేరణనిస్తున్న విరులతో,
మనోహరమైన ప్రకృతి సౌందర్య నిలయముగా
మారెను కైలాస పర్వత శిఖరము.
భవానితొ మహాదెవుడు ఆనందముతో
మూచ్చటలాడుచుందగా,ఘల్లుఘల్లంటూ
లయభద్ధమైన అందెల రవళులతో,
గాజుల సవ్వడులతో,మంజుల గానంతో
నాట్యమాడుతున్న సుందరి వారికి కనిపించెను
"అరవింద నయనాలతో,సంపెంగపూవంటి నాసికతో,
నీ సొగసులనే వెన్నెలను కురిపించే ఇందువదనా
నీవెవరవు?ఎచట నుండి వచ్చినావు?
నీ నివాసమెక్కడ?కొకిలగానంతొ మమ్ములను
రంజింపజేసిన ఒ కుందరదనా! పలుకుము
నీ మాటలనే ముత్యపు సిరులను నేను ఏరుకొందును"
అంటున్న సదాశివుని పలుకులకు ఆగ్రహించి
మరొక సవతి వచ్చునేమోనని కలత చెంది
శ్రీహరి మాయనెరగక జగన్మోహినీ అవతారములోనున్న
విష్ణువుని చూచి పార్వతి భద్రకాళి అవతారమెత్తెన్. ====Hima Bindu

==========================================

భస్మాసురుని సంహరించుటకు హరి మోహిని అవతారమెత్తగా, శివుడు మోహిని వెంట పడెను. ఆ సందర్భంలో మోహిని అవతారమెత్తిన "విష్ణువు ని చూసిన పార్వతి భద్రకాళి అవతారమెత్తెన్"

1) సీతా పరిణాయార్ధమై వచ్చి, శివ ధనుర్భంగం కావించిన రామావతారమున ఉన్న "విష్ణువుని చూసి పార్వతి భద్ర కాళి అవతారమెత్తెన్" (ఎందుకంటే, శివ ధనుస్సు ఇతర మానవ రాజుల చేత సంధింప బడలేదు)

సీత చేయి పట్ట శివుని విల్లు త్రుంచే
శివుని కీర్తి నేడు తలను వంచే
దైవ మాయదియని వదులునా మరి చిత్తము
విష్ణువుని చూసి పార్వతి భద్రకాళి అవతారమెత్తెన్‌=== KP Konduru

2) వసు దేవుడు అర్ధ రాత్రి బాల కృష్ణుని చెర సాల నుంచి తప్పించు చుండగా, అట్టి (బృహత్) కార్యానికి భంగం కలిగించు చున్న "విష్ణువు ని చూసి పార్వతి భద్ర కాళి అవతారమెత్తెన్" (విష్ణువు అన్న పదానికి అనేక అర్ధాలు ఉన్నాయి... గార్ధబం అందులో ఒకటి)
నడి రేయి వడి వడిగా సద్దుడిగిన కోటనుండి
ఉప్పొంగిన యమున దాట వసుదేవుడు పయనమవగ
జడి వానన తడి మడుగున పడగెత్తిన ఆదిశేషు తోడుగరాగ
మతిచెదిరిన గార్ధబమొకటి బిగ్గరగా ఓండ్రపెట్ట
కలత చెందిన చిన్ని కృష్నుని బిగ్గరగా కేకలేయ
కారణమైన విష్ణువుని చూసి పార్వతి భద్రకాళి అవతారమెత్తెన్‌ == KPKonduru


3) బుల్లి బుల్లి నడకల తో, ముద్దు గారు చేష్ట ల తో కైలాసం నంతటిని, అల్లకల్లోలం (చిందర, వందర) చేసిన బాల "విష్ణువుని చూసి పార్వతి భద్ర కాళి అవతారమెత్తెన్" (ఇక్కడ శుక్లాంబరధరం, విష్ణుం.. లో విష్ణువు... అంటే గణేశుడు అన్న మాట...).. అంటే, బాల గణేశుడు చేసే అల్లరికి పార్వతీ దేవి విసుగెత్తి పొయిందని నా భావన

బుడి బుడి అడుగుల బుడతడు
వడి వడి గా పరుగులిడు గున్నడు
నంది గణములను విడువడు
నందన వనములూ వదలడు
సందడి వండది చేయుచు
చిందర వందర చేయుచు
అందముగా అటునిటునడు
సుందర చేష్టల చిన్నడు
విసిగిన తల్లి యై
విష్ణువుని చూసి పార్వతి
భద్రకాళి అవతారమెత్తెన్‌ ==KPKonduru

====sv1973

ఉష్ణము చేసినా ఉదరబాధనెవడు తీర్చునని, కష్టించి
ముష్టి అయినా మూడు మెతుకులు లేనిదే బతుకు బండి నడవదని,
విసిగిస్తున్న సతి పార్వతి, ప్రతిదిన చర్యకు అలవడి పలుకులేని భర్త
విష్ణువుని చూచిన పార్వతి భద్రకాళి అవతారమెత్తెన్!!! === vEturiR
===================================

అడిగినదేచాలు వరములు ఇచ్చు
తన పతి భొళా శంకరునిచే
కల్గు సంస్యలను తీర్చుచు
విసుగు కనపరుచు విష్ణువునిచూసిన
పార్వతి భద్రకాళి అవతారమెత్తె == GodavarthiSitaaKumaari