Wednesday, December 06, 2006

జలజల, గలగల, వలవల, కలకల

జలజల, గలగల, వలవల, కలకల
లను పూర్తి పదంగా వాడ కుండా
అంటే "నది జలజల పారుతుంది" అని రాయ కూడదు
ఆ జలజల ను విడకొట్టవచ్చు
అర్ధం ఐందనుకుంటాను... పూరించండి



జలజ లావణ్య కోమల హస్త యుగళములగల రత్న
ఖచిత మణివేస్థిత అమృత కలశ కాంతుల దేవ
దానవ నయన నిశ్చేస్టతలు గలగ లలిత, లాలిత్యముల
నభినయించే. ఈ శృంగార రససృస్ఠి కావల వలపుల
కల్పవృక్షము కాక, విశ్వ శాంతికి విభుని మదిన
మేదిలిన కల కలదని, కాల గమనమునక్కటా
మరచిన మనకిది కధగా మిగిలే కదా !! ====KPKonduru
==========================================

టాటా, బిర్లా, బిల్లు గేటు, అంబాని లను వారి వారి పేరులా కాక

టాటా, బిర్లా, బిల్లు గేటు, అంబాని లను వారి వారి పేరులా కాక
మరో విధంగా వాడి, పేదవాడి ఆకలిని వర్ణించంది.

తను తిని నాలుగు రోజులైంది తన జీవితాన్ని తిట్టటానికైనా
సత్తువ లేని పరిస్థితి కూలి కోసం తిరగని వీధి లేదు
ఆలిదొక గల్లీ తనదొక గల్లీ బిచ్చమెత్తే మనుషులు కారు
గాలి తిని పలావునూహించుకుంటూ నీరు తాగి బీర్లాగనుకుంటూ
తిరిగి తిరిగి అలసి గుడిసె దారి పట్టి
గుడిసె కప్పు లోనించి వస్తున్న పొగలు చూసి
ఉన్న గుడిసె కూడ పోయిందన్న ఆతురతతో
ముఖంలో నెత్తురు చుక్క కరువైంది ,గుండె గుబేలు
గేటు తీసి త్వర త్వరగా లోనకెళ్ళి గంజి కాస్తున్న భార్యను చూసి
తినటానికి కాస్త గంజినిచ్చిన దేవుడికి మొక్కుతుంటే,
వీడ్ని పరిక్షించటానికా అన్నట్లు అంబాని ఆకలిగొన్న ఆవు పిలుపు
తన గంజిలోనే మరికాస్త నీరు పోసి కుడితి పట్టించాడు మన పేద జీవి!!
నమ్మిన వాళ్ళనే దేవుడెందుకు పరీక్షిస్తాడు?
==============================

మాసిన గుడ్డల్థొ వేడి వేడి బిర్యని
order చెయ్యాలని hotelకి వెళ్తే
ముందు billuకి డబ్బులున్నయ అంటూ
గట్టు వరకు నెట్టాడు బేరరు
ఇల్ల కాదని పాలవాడి దగ్గరకెళ్దామంటే
అమబాని అరిచే ఆవు కుద పులిల గాండ్రిస్తుందా
అని భయం చుస్తె తాతల నాటి నుంచి
నేథులు తాగిన వంశమె కాని
బిర్లగులని తిని చెడిన వంశం కాదు.

వేధింపులకు పొంగి భార్యనక్కున చేర్చెను

చక్కని పండు వెన్నల పచ్చని పల్లె తావు
మెల్లని పిల్ల గాలి చల్లని సెలయేటి జల్లు
తాతలనాటి కిర్రు మంచంపై మల్లెల పక్క
పారాణారని పల్లె పడుచు పెళ్ళామొకపక్క

చుట్టిన వేలి చిలకలను నోటికందించదు..
ఎరుపెక్కిన పాల బుగ్గలను చేతికందించదు..
జడ జాజుల గుబాళింపులను ఆస్వాదించనీయదూ..
తన సిగ్గు మొగ్గలను త్రుంచ వీలుకానీయదు...

తీయని అధరామృతములను ఒకింతొలికించక
ఈ సృంగార రసకేళి న తనది పైచేయి కాగా
రెచ్చిన తన తమకపు వేధింపులకు పొంగి
భార్యనక్కున చేర్చెను తనవోటమి ఒప్పి.

=========================


చక్కని పండు వెన్నల పచ్చని పల్లె తావు
మెల్లని పిల్ల గాలి చల్లని సెలయేటి జల్లు
తాతలనాటి కిర్రు మంచంపై మల్లెల పక్క
పారాణారని పల్లె పడుచు పెళ్ళామొకపక్క
నోటికొచ్చిన తన సన్నని వేళ్ళ చిలకల ని
వేదింపులకు పొంగి భార్యనక్కున చేర్చెనా
గలేక ఆవేళిక తనకప్పటివరకువున్న పట్టువదలి
==================

అధములకేల ఆధిపథ్యమని, ఆలసించిన అధొగతియని...
రొదించిన జనత కళ్ళ ముందు కదలి...పదవే అతనికి పెళ్ళామయ్యె...!
బాధించినా..,దెశ ప్రేమకు లొంగి, రక్తసిక్తమయిన రాజకీయ
వెధింపులకు పొంగి భార్యనక్కున చేర్చెన్‌!!! =====vEturiR

తల్లిని పెళ్ళికూతురిని చేసి సంబరమున అల్లుడికి కట్టబెట్టె!!!

బుడిబుడి అడుగులతో పడుతూ లేస్తూ,వచ్చీ రాని మాటలతో అమ్మా అంటూ..
చిలిపితనపు అల్లరితో చిందులు వేస్తూ, మారాము చేసినట్టి నిన్నటి ముద్దుల పట్టి,
నేడు మెట్టినింటికి వెళ్ళిపొతుందని మనసులోని బాధ కన్నీరై పొంగినా, చెదరని చిరునవ్వుతో
చేతులార తన చిట్టితల్లిని పెళ్ళికూతురిని చేసి సంబరమున అల్లుడికి కట్టబెట్టె!!!

======================================

సకల సద్గుణ సుందర సుకుమార సౌందరయ వల్లిని,
సమస్త శాస్త్ర వేద వేదాంగ భూషిత కల్ప వల్లిని
శంకర భక్తి తత్వాంతర్గత విలీన సతీ మ తల్లిని
పెళ్ళికూతురిని చేసి సంబరమున అల్లుడికి కట్టబెట్టె
=======================