Monday, November 13, 2006

బ్రాంది, విస్క్య్, వైనె, రమ్ము, జిన్, బీరు సృంగార రసాని ఒలికిస్తూ పూరించండి!!

సుకుమారా! సుందరాకారా! నీ కన్ను కలిసినంత నా కన్ను, జిల్లు మనెను రా నా మేను (జిన్ను)
నిను చేరి యుల్లము రంజిల్లక యెందుకీ సవిద్యుల్లతా మేని లావణ్యములు మదనా (విస్కీ)
మనల అమర సౌఖ్యముల తేలియాడించు అనువైన చోటు వేచియున్నది అమృత సదనా (వైను)

కోరి వరించిన కన్య యందించు స్వర్గ సౌఖ్యముల పొంది భ్రాంతి వీడుము వావి వరసల సారంగా! (బ్రాంది)
నీ పొందు కోరిన నేను, యెదురైన నెవరు భీతిల్లు దాన కాదురా ఓ శృంగార మదనాంతరంగా! (బీరు)

===================================================

జింకలా చంచలమైన కన్నులుకల గడసరి, బింకమొకింతయు లేక,
విసిగి చికాకుల దుప్పటి నెత్తి గప్పిన బావను రమ్మని లేపలేక,
దుప్పటిలొ తలనుపెట్టి, బావ నోటికి బుగ్గ నిచి, బావా కొబ్బరంది!
పిల్ల నడుమును ఒడిసి పట్టి, పొడవైన మెడకు ముద్దుపెట్టి, బుగ్గ కొరికి,
కొంటెగా, బీరువాలొ బెల్లముంది, తెచ్చి పెట్టనాయని కన్నుగీటే !!
=====================================


వె౦డిపూల జల్లు కురియు ని౦డు పున్నమి రేయి నా
చెలియ తలపు మదిని కదల తెలియని ఒక హాయిగా..

అపర౦*జిన్ తలచిన౦త విరహమతిశయి౦చుగా
వైన*మైన ఆమె వగలు తనువు మనసు ని౦డుగా..

చల్లగాలి తెమ్మెరలే సఖియ కురులై తాకెగా
చెలియమేని పరిమళాల చ౦దనాలు చల్లెగా...

ని౦గివిడి నా వెన్నెలమ్మ నేలచేరి నడచుగా
అరవిరిసిన అధరసుధలు అ౦ది౦చే తీరుగా...

చెలియ వలపు తలచిన౦త తీపిబాధ కలిగెగా
ఎ౦త సేపు ఎదురుచూపని మది తొoదరచేసెగా...



నిమిషాలే యుగాలై కోమలి కై వేచినా
మ౦దగమన రాలేదని మనసు పరితపి౦చెగా..

ఆమె రాక తీరునే విరహ౦*బీరేయనుచు
అ౦*బరానదీపమ౦టి చ౦దమామ నవ్వెగా..

నడిరేయి గడియు వరకు చెలియరాకపోయినా
*విసికి పోని నన్ను చూచి విరులు వగచె జాలిగా..

చెలియా రా*రమ్మ౦టూ విరహగీతి పాడినా
రమణి కాలియ౦దియల అలికిడి వినరాదుగా..

కలనైనా కలహ౦స కరుణి౦చక పోవునా
కనులుమూసి నిదురి౦చని మనసు ఊరడి౦చెగా..

ఇలియాన, సదా, త్రీష, చార్మి లను వాడి, ఒక పౌరాణిక కధ మూలంగ, సమస్యని పూరించండి.

ఏవరైతే భూప్రదక్షిణం చేసి అన్ని పుణ్య నదులలో స్నానం చేసి ముందుగా తిరిగి వస్తారో వారికే గణాధిపత్యం లభిస్తుంది అని పందెం పెట్టాడు పరమ శివుడు. కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం మీద బయలుదేరాడు. వినాయకుడు అక్కడే ఉండి తల్లి తండ్రులకు ప్రదక్షిణం చేస్తూ నారాయణ గాయత్రి జపించాడు. దాని ప్రభావంతో కుమార స్వామి ఏ నదికి వెళ్ళితే అక్కడ తన కంటే ముందు స్నానం చేసి వస్తున్న వినాయకుడు కనిపించాడు....

గణాధిపత్యము సాధించ నే సమర్థుడననుచు సంతసిల్లి
యానమునకు మయూరము తో జనిన కార్తికేయుని గని సదా
ప్రసన్న చార్మిళితమౌ మందహాసమొలికించు గుజ్జు రూపుడు
తల్లి దండ్రుల మించు ప్రత్యక్ష దైవము లేదని భక్తి మీర
ప్రదక్షిణ చేసె జపించుచు నారాయణ గాయత్రి,
షణ్ముఖ సోదరుడు వినాయకుడు గణాధిపత్యం పొందగా!

==============================


బాల్య మిత్రునికటుకులు తెచ్చి బిడియపడుచు, రాచ మర్యాదలకు
అబ్బురబడు, సత్సీలత సదాచార్మిళిత సంపన్నుడునగు
సుదాముని, సుందర దరహాస ముఖుదు, గోపీ మానస చొరుడు
గని, వేరొకరిది కాదిదినీ ఇల్లే యన. పారవస్యమున ఒలికిన సుదాము
అశ్రుధారలు, శ్రి కృష్ణుని పాద పద్మములపై పడ, ఆకాశమునుండి
గంగొత్రి, శంకరుని శిరమున పడిన భంగి సభకగుపించే!!


=============================


శ్రీరాముడు వనవాసానికి వెళ్ళే స౦దర్భ౦...

కలనైనా ఎడబాటును సైపలేని సదాచారి మితభాషిణియై....

మణిభూషణముల్ త్యజి౦చి...నారచీరన్ ధరి౦చి..

తానూ తోడుగ వచ్చుననుచు పదముల ప్రణమిలి యానతి

వేడె వినయమునా జనకపుత్రి శా౦తారామున్.

============================

పోకిరి, పౌర్నమి, చక్రం, టాగొరె చిత్రాల పేరులను వాడి, రామాయణ సంబంధమైన పూరణ చేయండి

రామాయణ యుద్ధ౦లో మేఘనాధుడు కూడా మరణి౦చిన సమయ౦లో విభీషణుడు తన మనసులో ఈవిధ౦గా అనుకున్నాడు......


మహాదేవు మెప్పి౦చి యమోఘమౌ వరముల౦దిన యాతపోకిరీటి మది పోకిరి యై కోరెను విష్ణుపత్నిన్..

ని౦డు పౌర్ణమి వలె మును భాసిల్లిన ల౦కానగర సామ్రాజ్య విభవ౦బు నేడు వెలవెల పోయెన్..

ఎ౦త వారలైన, మోహ౦బున పరకా౦తల కోరి తప్పి౦చుకొన వీలే కాల చక్రమున్...

రావణుడేల నకటాగోరె సీతననుచు విభీషణు౦డు వగచెన్!
=======================================


భరతుడు రాముని అడవికి పంపి తనకి పట్టాభిషేకము
చేస్తారన్న మాట విని ఇట్లా అనుకున్నాడు.

కాల చక్రము నా మీద నిక్కముగ పగ పట్టే! అకటా నిది
మాత ముఖమున బయల్వడిన మందర విష పూరిత తలపో!
కిరీటము నా తల నిడ ఆమె హృదయమున మొలిచిన కలుపో!
ఔర! నిమిలిత పద్మ నేత్రుని కానలకు పంపుటగోరె కదా?

=================================


పోకిరిగా తరులు దరులు తిరుగుచు, ఒకటియునొదలక, అకటా
గురులు తప్పక నిర్దయుడై పక్షుల జంపెడి వాడును,
రామ మర లకు వ్యత్యాసమెరుగని నాస్తికుడునగు బోయవాడు,
విధి చక్రము తిరిగి, బ్రహ్మ పుత్రుడు జ్ఞానము పోసినంత,
పౌర్ణమి వెన్నెల వలె చల్లగ హృదినాహ్లాదము గలిగించు
రామ చరితను జగతికి అందించె ఆసువుగా ఆదికవియై!!

==============================

సీత చెంత లేని ఈ పౌర్ణమి కూడ అమవస నిశి కాదా యని రామన్న
చల్లని వెన్నెలకటాగురుతుకు తెచ్చుచునది వదినెమ్మ దీవెనలని సౌమిత్రి
కాలచక్రమే పగ బూనినదా దిక్కుకానరాకున్నది యని, సీత జాడ
పాలు పోకిరువురి మానసములు మూగగా రోదించినవి పరి పరి విధముల

విడాకులు కోరిన ముత్తైదువ కేసి ముచ్చటగా జూచిరందరు!

ఉగాది రోజునుదయాన్నే నిదుర లేచి, అలుకు కళ్ళాపులు అప్పుడే చేసి,
ఇంటిముందు మంచి ముగ్గులువేసి, స్నానపానాదులు చిటికలొ ముగించి,
తనదైన సైలిలొ పట్టు చీరను చుట్టి, నుదుటిన కాసంత కుంకుమ దిద్ది,
కంటికింపుగ కాటుక అద్ది, హడావిడిగా పనులన్ని చక్క బెట్టిననూ,
కళరాని ఇంటికి కారణమేమని ఆలోచించి, పచ్చదనమని గ్రహించి, మా
విడాకులు కోరిన ముత్తైదువ కేసి ముచ్చటగా జూచిరందరు

================================


హడావిడి లేక స్తబ్దుగా ఉన్న పెళ్ళి వారింటికి వచ్చీ రాగానే,
బడాయికి పోక చిన్నా పెద్దా అందరిని పేరు పేరునా పలకరించి,
దడా దడా పనులు పురమాయిస్తూ, తలవాకిలికి తోరణానికి మా
విడాకులు కోరిన ముత్తైదువను ముచ్చటగా జూచిరందరు !!

===============================

వి౦దుకు వియ్యాలవారు వచ్చెడి వేళైనదనుచు ,వడివడి వడ్డి౦పకున్న అలిగెదరనుచున్..
పస౦దయిన పి౦డివ౦టలనొకపరి పరికి౦చి చూచి, అటుగా పోవుచున్నయమ్మలక్కల పిలిచి..
వ౦డిన వ౦టలు మేలు మేలు... మరి వచ్చినవారలప౦డుటకి౦కొన్ని కావలయు తెమ్మనినన్..
వారలు తలది౦డ్లా ఏమని మదియోచి౦పన్, అతిగా ఆలోచి౦పకుడని తానడిగినవి తా౦బులములని
చిరునవ్వున సెల*విడాకులు కోరిన ముత్తైదువ కేసి ముచ్చటగా జూచిర౦దరు!

==================

అల్లుడే కోడలై కనెనాందముగను

మేనమామన్ మనువాడ, అమ్మయాడబిడ్డకాగ..మురిపె౦గా పె౦చినట్టి తాతయ్యే..మామకాగ,

పసిబిడ్డను ప౦డుగగా చేతిక౦దినమ్మమ్మ... మనుమనిగా మునిమనుమని గని ,

స౦బరమ౦బరమ౦టగా ...చెప్పెన౦దరికిన్ తన మనుమరాలిన్ జూపి

'ఇక దీవి౦చి అక్షతల్ జల్లుడే , కోడలై కనెన్' ఆన౦దముగను.
==============================

"తల్లి తండ్రులను,ఆలుబిడ్డలను లక్ష్య పెట్టక
కల్లుపాకలొని మధిరతొ కాపురమెర్పరుచుకున్న
భర్తను మందలించే ప్రయతనములొ విఫలమిన
మా ఇంటి దీపం అల్లుడై అవతరించి నా సుతుని
దండించి ఆపై సరిదిద్ది ఇంటికి కళ తెచ్చిన సుభవేళ
అందరితొ కలిసి బంగారు భవిష్యత్తుపై తీయని కలలను
అల్లుడె కొడలై కనెను ఆనందముగాను" అని పలికె అత్తగారు

హనుమ వలువలూడ్చే సీతకు లోకము చూచుచుండ!!

రామ చిహ్నమెవరు దేవికడకు మోసుకొచ్చె సభకువచ్చిన ద్రౌపదిని తుఛ్చులేమిచేసె
హనుమ తెచ్చిన చిహ్నమెవరికిచ్చే తుఛ్చులనెటుల చంపుదునేనని భీము ప్రతినబూనే
ఇతిహాసములెరుగని, కనివినియెరుగని ఘటనలిచ్చి, మతులు చెరుపు ఆత్రేయా!
ఇదిగో కాచుకో నీ పూరణలకు నా సమస్యలు అదే వరుసలో! ఇకపైనా ఈలాగుననే
ఉత్తమములైన సరికొత్త సమస్యలిచ్చి మము తత్తరభిత్తరులుగ చేయి నీ మనసారా!

=======================================


శ్రీరామ పట్టాభి షేకమున హనుమ౦తుని భక్తి యొక్క వర్ణనము.

మణిమయాసనమునల౦కరి౦చిన యా జానకీరాముల జూచి కనులు చెమ్మగిల్ల,
పదముల౦టిన యా కపిశ్రేష్ఠునిగని..అ౦తర౦గమున పుత్రవాత్సల్య౦బు పొ౦గ యాతల్లి..


తనకతిప్రియ౦బైన యాణిముత్యపు మాలనొసగన్..
వినయమొప్పారగ చేతన్ పట్టీ పట్టగనే నోటన్ బెట్టి కొరికి చూచి,
నేలన్ గొట్టిన మారుతి వి౦తచర్యలకాశ్చర్యమునన్..
వానరముఖ్యుడిట్లేల చేసెననుచు కొ౦దరు చూడ...


కపికేమి తెలియు అమూల్యమేలిముత్యముల విలువయని..
యాపరమసాధ్వి యపరిమిత ప్రేమనవహేళన చేసెనని మరికొ౦దరననుకొన,
యా నారీశ్రేష్థయును చిన్నబుచ్చుకొన...
రామనామము కానని దేనియ౦దభిమానములేని వాడననుచున్..


తన హ్రుదయమును చీల్చి య౦దున్న ఇ౦దీవరశ్యాముని య౦దరిచూపి
ని౦డు సభను చుట్టిన స౦దేహముల హనుమ వలువలూడ్చే, సీతకు .....లోకము చూచుచుండ!!

తలను మరిచిన తండ్రికి తలవంచి వందనమిడె తనయుడు!

బ్రతుకాడిన చదరంగాన పావుగా మిగిలి, ఇచ్చిన మాటకై,
రాజ్యము, భొజ్యము, రాచరికపు భూషనములు మహర్షి కొదిలి,
తనతోను తల్లితోనూ కానల కొచ్చియు, తానొచ్చిన బాటపై చిన్
తలను మరచిన తండ్రికి తలవంచి వందనమిడె తనయుడు!!

======================================

రాత్రనక పగలనక కాయ కశ్టము పనులు చేస్తూ
తన చెమటను ఇంధనముగ బ్రతుకు బండిని నడుపుకొస్తూ
అమ్మ రోగము నయము చెస్తూ, మురిపాలను తనకు పంచుతూ
చిరుగుల అంగీ తను తొడిగి, బోసినవ్వులు నవ్వుకుంతూ, నుదుటి మడ
తలను మరచిన తండ్రికి తలవంచి వందనమిడె తనయుడు

=======================================
"అల దివి నుండి ఇల చేరిన మేనక,
ఋషి తపభంగమొనరించి కన్న బాలను,
వలపించి మనువాడి, అభిజ్ఞానమిచ్చి
శాపవశముచే మమ్ము మరిచితివీవు!

కలను గూడ వాడని నీ తలపు తో నిరతము వగచుచు నా తల్లి,
మేలగు విద్యలందు నీకు వారసుని గా మేటి వీరుని చేసినది
ఇలను" అని అలనాటి జ్ఞాపిక చూపి, తన తల్లి యగు శకుం
తలను మరిచిన తండ్రికి తలవంచి వందనమిడె తనయుడు!!

(అభిజ్ఞాన శాకుంతలం)
=============================

విధి కాటుకు బలియైన సతి రూపము
మదిని తలచి విలపి౦చే తరుణాన,
పారాడే తన పాపడి పాలుగారు మోము చూచి,
నేనున్నా నీక౦టూ చేరదీసి, అక్కున చేర్చి....

అమ్మగా లాలి౦చి, ఆప్యాయ౦గా పె౦చి, అన్నితానై నిలిచి,
మారు మనువు ఊసు తన మనసు తలుపు తెరువనీక,
పసినవ్వుల పరవశాన కలతలనే కాక వనితలను
మరచిన త౦డ్రికి తలవ౦చి వ౦దనమిడె తనయుడు.

తన తల్లి తల తెగనరికిన తనయు చూసి తండ్రి మీసము దువ్వెన్!!

ఓ కడవ చేసి ఇసుకతో, నీరు తెచ్చునా పరమ సాధ్వీ మహిళ
ఈ తడవనకటా మసకబారెనా మహిమ, సురుని చూచు వేళ
ఆగ్రహించిన తండ్రి యానతి ఆలసించక జామదగ్ని నెరవేర్చెన్
తన తల్లి తల తెగనరికిన తనయు చూసి తండ్రి మీసము దువ్వెన్!!

========================