Wednesday, November 15, 2006

కల అల వల తల చాల పూల నేల

కల అల వల తల చాల పూల నేల

పదాలను, వాడి ఒరిజినల్ అర్ధము కాకుండా వేరే విధంగ వాడి,
ప్రస్తుత (అ)రాజకీయాన్ని గురించి వర్ణించండి!!

అలనాటి కురుక్షేత్ర సంగ్రామమును
నేడు తలపునకు తెస్తున్న అసెంబ్లీ వేదికపై
మంత్రి పదవులకై ఎమ్మెల్యేల కలకల
ముఖ్య మంత్రి స్థానానికై మంత్రుల వలవల
ఆధికార తృష్ణ చాలదన్నట్లు
ధన దాహం తీరునట్లు
అసెంబ్లీనే తమకు నెలవుగా చేకొని
ఒకరిపై ఒకరు నిందల వర్షం
జల్లుకునే మహానుభావులు
మన రాజకీయ నాయకులు.

=================================

ఏమని చెప్పను నేటి రాజకీయ దుస్థితి?

నడక పోటీలు, పరుగు పందాలు
హై జంపు, లాంగ్ జంపూల విన్యాసాల
గిమ్మిక్కుల జిమ్ముక్కుల నెలవైన అథ్లెటిక్సు
నిలకడ లేని నేటి నిర్భాగ్య పాలిటిక్సు

ఐదేళ్ళకొకసారి మీరే దేవుళ్ళంటూ
పల్లె ప్రజల పేరు పేరున
పలకరించి పులకరించే
పాదయాత్రల నడక పోటీలు

పాలక పక్షం చేస్తున్న దురాగతం
చేయించడానికి ప్రజలకు అవగతం
ప్రతి పక్షాల సుడిగాలి
పర్యటనల పరుగు పందాలు

తమ పార్టీ లోనే
ముసలం పుట్టించి
పై వారిని దింపి తాము
గద్దెనెక్కే హై జంపులు

ఇక్కడ లాభం లేదని
అవతల పార్టీ లోకి
ఏకంగా మారిపోయే
కప్ప దాటు లాంగ్ జంపులు

ఇక్కడ ఉన్నప్పుడు
అలకల దీర్చుటకు
ప్రేమగా చేస్తారు
కర చాలనం

పార్టీ మారితే
పిలకల పట్టుకొని
ఉతికి ఆరేసే విమర్శల
కర్ర చాలనం


ఇంకేమని చెప్పను నేటి రాజకీయ దుస్థితి?
పదవిలోని వాడిని దింపాలని
మతకలహాలు రేపి..
ఈ సాకుతో ప్రజల చేరి
వల వలా ఏడుస్తారు
మొసలి కన్నీరు
జల జలా రాలుస్తారు

మేక వన్నె పులులు
గోముఖ వ్యాఘ్రాలు
విచ్చలవిడిగా
స్వైర విహారం చేసే
జనారణ్యం... నేటి రాజకీయం!!

========================

తెల్ల తూటాలనెదిరించిన తాతయ్య కంట కన్నీరా?
కలవరమెందుకని అలవాటుగా అడిగా...

కాదంటూ...లేదంటూ...
అన్నాడు వెండిపూల కండువా భుజాన్నేసుకుంటూ...
వలవలమంటున్న వందల హ్రుదయాలను చూస్తూ
మిన్నేల మిన్నకుంది విరిగిపడక అంటూ...

ఆసక్తిగా అడిగా మన నేతల వల్లేనా అంటూ...

అవునంటూ...
నాయకులయితే మనకేదో చేస్తారనుకుంటూ...
నీతి లేని నేతలనందలమెక్కించామంటూ...
తెల్లవాడే నయమంటూ...
మన అమ్మ పాలు తాగినా రొమ్ము చీల్చలేదంటూ...
చనుబాలు తాగిన మనవాళ్ళే చెరపడుతున్నారంటూ...
నేటి రాజకీయం...
భరతమాతను అంగట్లో అమ్మేస్తోందంటూ...
రాజకీయ నేతలా...
వాళ్ళు నరకాసుర వారసులంటూ...
వనిత వలువల విలువ తెలియని కీచకుని చంచాలంటూ...
నాజీ నియంతని మించిన నరరూపరాక్షసులంటూ....

నిజమేగా అనుకున్నా...మరుజన్మపై నమ్మకం కుదిరి
పురాణాల పాత్రలన్ని కళ్ళముందు కదిలి...
పోస్ట్ గ్రాడ్యుఏట్ చేసి ఏం లాభమనుకున్నా....
అందుకే...నా పొలం లో కలుపుతియ్యాలని నిర్ణయించుకున్నా!!!

==============================


పేదవాడి కలల్ని, ఆశలని పెట్టుబడిగా
నేటి నేతలందరూ చేసే ఎన్నికల వాగ్దానాలు
గాలి మూటలని, అరచేతి స్వర్గాలని తెలిసీ
ఒక సంచి సార, బిరియాని మూటకి లోబడి
తెరచాప తెగిన నావలా దిశ మరచి,
గుడ్డిగా వోటేసి, గూండాలనెలా గెలిపించి
తమ కన్నులని తామే పొడుచుకునే పిచ్చి
జనాలకి ఏమని చెప్పాలి? వీరు మారే దెప్పుడు?

పెద్ద చదువులు చదివి, పట్టణాలలొ, ప్రైవేటు
వ్యవస్థలకు వెట్టిచాకిరీ చేస్తూ, హైటెక్కు
జాబులంటూ, గురివింద గొప్పలు పలుకుతూ, వోటు వేసే
బధ్యత మరచి, కార్పోరేటు చెంచాల
వూడిగానికి డప్పులసరి వత్తాసు పలుకుతున్న,
నేతి యువతకి ఏమని చెప్పాలి? వీరు మారే ఎప్పుడు?
============================================

చెప్పాలంటె కుళ్ళు రాజకీయ చరితాల
నిమిషం ఆలోచించకుండా రాయచ్చో నవల....
చెసేస్తారు వాక్దానాలు ప్రపంచమంతా వినేలా
మరి ఎక్కడ చూసినా అభివ్రుద్ధి నడిచే పీతలా....

పెట్టేస్తారు మరి ఇట్టె మన చెవిలో పూల
నమ్మి వేసామా ఓటు ముంచుతారు మన పీకల....
ఏ పనిజరగాలన్నా టేబల్ కిందనుంచివ్వాల్సిందె లంచాల
ఇప్పుడు వేలూ లక్షలే కాదు అడుగుతున్నారు కో.....ట్.....ల...

పెన్నుపట్టి రాయలేరు గట్టిగా రెండక్షరాల...
సంతకానికి కుడా వెయ్యాల్సిందె నిషానీల
అయినా ఎక్కేస్తారు మినిస్టర్ల కుర్చీల...
ఏడాదికె రప్పించేస్తున్నారు మళ్ళీ ఎలక్షన్ల.

వస్తాయి మూడురోజులకొకసారి మంచినీళ్ళు మునిసిపల్ టాపుల..
వాటికోసం కొట్టుకుంటూ నిలబడాలి మైలుదూరమున్న లైనుల
ఆటో ఎక్కామంటె పడతాం అరగజం లోతున్న గుంటల..
ఎవరు గద్దెక్కినా మారవుకదా రోడ్లు మన వీధుల.

ఇంక కొత్తగా చెప్పడానికేముంది మన పరిస్తితుల..
మరి ఎవరు మారుస్తారో కదా మన అద్రుష్టాల!!!! ==== mounamanasa

=======================================================

ఎన్నో రంగుల జండాలు ఏ పార్టీ ఐతేనేమి?
ఏ నాయకుదైతేనెమి? ఎన్నికల
హడావుడిలొ వాగ్దానాల అల
వాట్లొ పొరపాటుగ మీ కడవల
నిండుగా ఎప్పుడూ నీళ్ళు వుండేటట్టు
చూస్తాననగానె ఎక్కడో అవతల
వున్న మూదు కాళ్ళ ముదుసలులు మంచాల
నొదలి ఓ మా ప్రియతమనాయకా
నేటి ఈ రాజ కీయాల కుళ్ళు కంపూ ల
క్షల ఎకరాల స్వాహాలు చూస్తుంటె
మాతరం వారి నిస్వార్ధ త్యాగజీవితాలు
వ్యర్ధమాయెనని మాకు విరక్తాయెను
మరల నిస్వార్ధులైన మీ మేధావి వర్గం యువత అందరు ఒక్కటైతేనే ల
క్షణమైన సుసంపన్నమైన భారతవనిని చూదగలమనిరి

చికెన్ మటన్ బీఫ్ పొర్క్ లను వాడి, ఒక్ వెజిటేరియన్ దిష్ రుచిని వర్నించండి!!

చిట్టి డుంబు ముద్దుగా మారాము చేస్తూ
మామిడ్ది జెల్లీ చేయ మాతనడ్దుగ,
మంచి పండు మామిది రసము తీసి
బెల్లంతొ కాస్త గట్టి పాకం చేసి
తీసిన రసాన్ని, దాంట్లొ కలిపి, వేడితగ్గాక
పీచు లేకుండా బాగ రుబ్బీ, ఫ్రీజెర్లో తోసి
ఒక గంటాగి డుంబుని రమ్మంటే
పోరుకురికిన సిపాయి లాగ ప్లటుపై పడి
పిసరు మిగల్చక పీల్చేసి, చివరికి
వదలక చీకెను చేతి వేళ్ళు
==========================
నీటుగా నానిన మంచి మినపప్పును,
చేయితిరగ , మా బామ్మ.. రోటిలో
చక్కగ రుబ్బీ...ఫలహారానికి..

వైనంగా వడలు చేసి......
చిక్కని మీగడపెరుగు లో చప్పున వేస్తే...

బాగ నానిన పిమ్మట నోరూరించె ఆ
కమ్మటి పెరుగు వడలు నోటనుబెట్టినవారందరూ

"ఆహా!! ఎమిరుచి, ఇదే కదా బామ్మ చేతి అప్పచ్చి"
అని, పొగడకపొరుకదా.......

=================================

లేత తొటకూర తుంచి కొంచెం వుప్పు తగిలించి,
దోర మగ్గిన రామమునగ లేద టమటాను కోసి
మంచి మునగకాయలు మృదువుగా చేర్చి
పెద్దవుల్లి తగినంత కొసి, వుడికిన కందిపప్పు కలిపి
కాస్త చిన్న వుల్లి మిర్చి రుబ్బి ఫ్రై చేసి కలిపి
చింత పులుసు లోన మరగ కాచి వద్దిస్తే!!
స్వర్గానికి రెందు అడుగుల దూరంలో ఆగినట్లే
ఇది కాక, ఎర్ర వుల్లి పొరలు విడదీసి, ప్రతి పొరకు
కాసింత శనగ పిండి అద్ది వేఇంచి, కరకర మంటూ
నంజుకు వడ్డిస్తే, అబ్బ మనకిక స్వర్గమక్కర లేదు!!
=====================================

ఇదిగో నా విచిత్ర వంటకం..
ఇందులొ ఉంది నా సంతకం.. (అంటే నా స్టైల్ అన్నమాట..)

బ్రహ్మచారి కొంప లో నా వంతుగా వంట పని చేసే అవకాశం నేటికి చిక్కెననుకొని
గుత్తి వంకాయ కూర విరగదీయాలని ముక్కలు కోసి, మసాల బెట్టి, మూకుడులో వేయిస్తూ..
అంతలోనే గోబీ ఫ్రెష్ గా ఉన్నదని చూసి, "గుత్తి గోబీ వంకాయ" .. ఆహా అమోఘం
అని అది సన్నగా తరిగి మూకుడులో వేసి ఉడికించి వడ్డిస్తే..గరం గరంగా
తిన్న రూమ్మేట్లు నీ వంతు వచ్చేసరికి ఇట్లా ప్రయోగాలు చేసి ...రంగ రంగా
ప్రాణమెందుకు తీస్తావని పోరుకు దిగగా... నిజమే పాడు లోకం మేధావులు
ముచ్చటగ చేసే ప్రయోగాన్ని మెచ్చదని ముచ్చెమటను తుడుచుకుంటూ..
నిట్టూర్పు వదిలాను...వాళ్ళు పాపం తూరుపు తిరిగి దండం పెట్టారు...