Friday, January 12, 2007

ఉత్తరాన భానుబింభముదయంబాయెన్

"ఉత్తరాన" అన్న పదాన్ని "ఉత్తరమే" అని వాడు కొవచ్చా ?
ఆ మాత్రం స్వేచ్ఛ ఇస్తే, ఇదో పద్యం

భరత ఖండమునకు దక్షిణమున ఉన్న
లంకా పురి ని కారు చీకటి వలే ఆవహించిన
రావణాధముణ్ణి దశరధాత్మజుడు సంహరించిన
ఉత్తరమే భానుబింబోదయంబాయేన్ ప్రజలు మెచ్చగా

(ఇక్కడ ఉత్తరమే అంటే వెంటనే అని అర్ధమ్)

మీరు కొద్దిగా strict అయితె, ఇది నా solution,
(well, as i said earlier, i am not a poet)

తొలి ఉషా కిరణముల కెంజాయ రంగులద్దుకొన్న
మానస సరోవరమును గాంచి అచ్చటనె
విహరించుచున్న గరళ కంఠుడు పార్వతి తో ఇట్లనియె
" దేవి! చూడుము ఉత్తరాన భాను బింబోదయమయ్యెన్"

దీని నే కొద్దిగా మారిస్తే

శివ పార్వతులు మానస సరోవరంబున విహరించుచుండ,
కేళీ విలాసమున ప్రాణనాధుని శృంగారమునకు పరవశించి
ఎరుపెక్కిన గిరిజ ముఖారవిందము గాంచిన సురులు
ఆశ్చర్య పొయె ఎప్పుడు "ఉత్తరాన భాను బింబోదయమయ్యెన్"? ====sv1973

===============================================================

బల్లెమేయక
బాణమేయక
గుండు పేల్చక
వెన్ను చూపక
కల్లలెరుగక
ఎల్లలెరుగక
బాపు చూపిన
సత్య మార్గమున
నెత్తురు చిందించి
కొత్తగ కలిసివచ్చిన
సమైక్య భరతావని
సత్తువ గని
బిత్తరపోయి
కత్తివాటుకు
నెత్తురు చుక్క లేక
తెల్లమొగమేసిన తెల్లదొరలు
తెల్లవారకమునుపే తరలిపోయిరి...
దేశం నలుమూలల నుండి
దేశం నలుదెసల నుండి
ఈ అర్ధరాత్రి స్వతంత్ర్యాన్నిదర్శించి
ఈ అమృతఘడియను వీక్షించి
ఉత్తరాన భానుబింబముదయంబాయెను
త్రివర్ణ పతాకపు అశోక చక్ర రూపముగనని
వేడుకలుకు స్వాగతం చెప్పిరి
వేదనలకు వీడ్కోలు చెప్పిరి..

-రోహిణి
=============================================

భాను తో పెళ్ల్ళైన పదహారు రోజులకె
ఆకాసయానాన అమెరికా కేగిన కొత్త
పెళ్ళెకొడ్కైన ఆనంద్ వూహల స్వర్గాన
విహరించుచుండ తపాలశాఖవారిచ్చిన
వుత్తరాన భాను బింబము ఉదయంబాయన్
అది గాంచి ఆనంద్ ఆనందములో వెంటనే
ఫొను వరికి తగురీతి
ఆదాయము పెంచెన్

ఏకచక్రము కలిగిన సప్తాశ్వరధమందు
అనూరుని సారధ్యమున దక్షిణాయన
షణ్మాసములు విసుగులేక పయనమాచరించి ప్రజలకెల్ల
పుణ్యకాలము ప్రాప్తింప దయతొ
ఉత్తరాన (ఉత్తరయన పుణ్య కాలము)
భాను బింబొదయంబాయెను


=======sitakumaari

========================================

చిత్తము చూపిన పూవు తూర్పున
మెత్తని బుగ్గల నల్లనయ్య దక్షిణ, దీచిన క్రొం
గొత్త దళముల క్రొక్కారు వెలుగు గీయబోయె
ఉత్తరాన, భానుబింభముదయంబాయెన్! ========sarma drk

ల, లల, లలలా,లలలోలా, ల్లాలిలోలా లను అంత్య పదాలుగా వాడి

మరో సమస్య
ల, లల, లలలా,లలలోలా, ల్లాలిలోలా లను అంత్య పదాలుగా వాడి
అంటె పూరణలోని పదాలు పైన చెప్పిన పదాలతో అంతం అవ్వాలి
పూరించండి
=====================================

సంధ్య వేళలో యమునానదిలో
జలకాలాడే కన్నె"ల"
కలకలలు,వెన్నకై చిలికే
పల్లె పడచుల గాజుల గలగ"లల"
నే సవ్వడుల నడుమ "ల ల లా "
అంటూ కొకిల మంజుల గానమెవ్వరిదో
నన్న తలంపుతో ఆ గానము వెన్నదొంగదేయన్న
ఆశతొ గొపకాంతలు తమ క"లలలోలా"
నడకలకు సొగసులనద్దుకొని
వయ్యారాలకు ప్రేమనలుముకొని
మదిలో గోపాలస్వామిని తలుచుకుంటూ
వెదుకుచుందగా,పూపొదలొ దాగియున్న
మాధవునకు గోపికల పాదధ్వనులతొ పాతు
వ్రేపల్లెకు మహారాణి నందుని"ల్లాలి లోలా"
కుల రవళులు వినిపించగా,గొపికలతోను
గొపాలకులతోను ఆటలు చాలించి
తల్లి యశోదమ్మ చెంతకు చేరెను గోకుల కృష్ణుడు. == himabindu

================================

మును పెంజీకటి కవ్వ ల
గల దైవము శిష్టరక్షణల,ల
గ్నమైఉండ క్షీరాబ్ధి కన్య
అలసట పారద్రొల అలల, లా
లి పాడుచుండ గమనింపని
విభునిపై చిరుకోపము చెందిన,
అలిగిన తన సతి అలకలలలో,లా
లిత్యముగని మురిపెముగా ఇల్లా లి, లోలా
కులు కదులుచు మెరయుచుండ
తన లక్ష్మిని సంబరముగ వీక్షెంచెన్ ==== SitaKumari

==================================

మా ఊరి లో ఉంది ఓ నిర్మల
ఉంటుంది బాపు బొమ్మలా, పాడుతుంది కోకిలలా
ఎగిసి పడుతుంటుంది సముద్రం లోని అలలలా
వస్తూ ఉంటుంది మా ఇంటికి, నిద్రలో తియ్యటి కలలలోలా
చక్కగా శ్రీదేవి లా ఉంటుంది చిత్రం "ఇల్లాలి" లోలా (i mean sridevi as in movie "illalu")
ఈ అమ్మాయి నే చేసుకోవాలి ఎలాగోలా ===== sv1973

======================================