అమృతమే విషమై ప్రాణముల్ హరియించెన్!!
దేవదాసుకు పార్వతి ప్రాణం
ఆమె ప్రేమే అతని అమృతం
వికటించిన విధితో ఆప్రేమా
అమృతమే విషమై ప్రాణముల్ హరియించెన్!! ..sv937
సురలోకాన సంబరాలు కలిగించు మధువు
మతిని మరిపించి మందమతులుగా చెయుచు
భువిని అగ్నానులు అదియె స్వర్గమనుచు తాగ
మధువు నేడే అమృతమే విషమై ప్రాణముల్ హరియించెన్!! ...GodavarthiStaaKumaari
మిత్రమా!వేడి వేడి జిలేబీలు,లడ్లు,బూరెలు పాయసాలు,
పరమాన్నాలు అంటూ తీపి పదార్ధాలను భుజించితివి.
చక్కెర వ్యాధి కల్గిన నీకు ఈ మధుర "అమృతమే
విషమై ప్రాణముల్ హరించెన్"అని విచారించేనతడు.!! ... Himabindu
తాజ్ మహలు ప్రేమకు ప్రతిరూపమై నిలిచినా, సలీం అనారుల ప్రేమ సమాధి కోరెన్...
రాధామాధవుల ప్రేమ మధురానురాగమై నిలిచినా, పార్వతి దేవదా ల ప్రేమ విషాదమై కలచెన్...
జగమున ప్రేమ అమరమై నిలిచినా, విఫలమైన నాడు విషాదమే మిగిలిచెన్,
చిత్రముకాదే! కాలమహిమన్, వలచినవారి ప్రణయామృతమె విషమై ప్రాణముల్ హరియించెన్!!! ...moundamanasa
3 comments:
ఇది పద్యం కదండీ. బాగుంది. పద్యం రాయాలనే మీ ఉత్సాహానికి అభినందనలు. పద్యాన్ని ఛందోబధ్ధంగా నాలుగు పాదాల్లో ఇమిడ్చినపుడేకదా అది చదివినపుడు శ్రావ్యంగా వినిపించేది. కొన్ని చిన్నచిన్న ముద్రారాక్షసాలున్నాయి (అచ్చుతప్పులు). పద్యంలో అవి అసలుండకూడదు. పద్యాన్ని రాసేవారే కరవైన ఈ రోజుల్లో మీ ప్రయత్నం ఎంతగానో అబినందనీయం.
ika achu tappulanTaaraa, vaaTini sari diddu taanu..
ramanadha reddy gaaru naaku kavitvam raadandi
kaani telugu anTe abhimaanam
edO raayaalani cheyyaalani tapana
andukE edO udataa bhakti gaa ila chEstunnaanu.
chandobadhdhamgaa raayaalani naakuu tapana vundi.
kaanee sari ayina guidence, time lEka chEya lEka potunnaanu.
nEraasE tavikalani, chando badhdham chEya galigina kaarya karta dorikitE naaraata lanni nEnu maarchaTaaniki Ready.
Post a Comment