Tuesday, October 24, 2006

ఆలొచనలో పడిన అయ్యప్పస్వామి ముక్కున వేలు వేసుకొనెన్

ఆంధ్ర నుండి వచ్చు అయ్యప్ప స్వాములలొ
తన శబరిమలను భక్షించు
భూ బకాసురులు ఉన్నారేమొ అను
ఆలొచనలొ పడిన
అయ్యప్ప స్వామి ముక్కున వేలు వెసుకొనెన్‌ ==GodavarthiSitaKumari
=============================

జన్మభూములు, కరసేవలని స్వార్ధపరులు గడుపుతున్న పబ్బాల్ని చూసి
ఏడు కొండలవాడికి రెండే కొండలన్న పెద్దల మాటలు విని
అయ్యప్పను స్త్రీ తాకెను అయన అక్కడ వుండడన్న జొశ్యం చూసి
ఈ యుగమున ఇంకేన్ని వింతలు వస్తాయొ అన్న
ఆలొచనలో పడిన అయ్యప్పస్వామి ముక్కున వేలు వేసుకొనెన్
=========================================

అన్న గణపతి పాలు తాగి populaరయ్యె
తోక స్వామి pictuరు దిగి publiక్కయ్యె
మేరి మాత weeపు చేసి మనకు చేరువయ్యె
దేవుడా!! ఇంక, newసెక్క నాకేమి మార్గము మిగిలెనని
అలోచనలో పడిన అయ్యప్పస్వామి ముక్కున వేలు వేసుకొనెన్
==========================================
శ్రీహరి జగన్మొహిని అవతారమున
హరిహరులకు స్తుతింగా జనిమిచితిని.
ణా తండ్రి మహాదెవుని అర్ధాంగి
పార్వతీ దేవి నాకు మాత యగును
మరి నాదు తల్లి శ్రీహరి ఇల్లాలు
ఐన రమాదెవిని ఎటుల సంభొదించవలెనన్న
ఆలొచనలొ పడిన అయ్యప్ప స్వామి ముక్కున వెలు వెసుకొనెన్.

=============================================

తల్లి తండ్రులయిన శివ కేశవులకు
సుతునిగా జనిమిచి ధన్యత చెందితి.
నా తండ్రి శంకరుని ఇల్లాలు అయిన పార్వతి దేవి
నాకు తల్లి యగున్.మరి శ్రీహరి సతి రమాదెవిని
ఏనెటుల సంభోదించవలెనొ అని "ఆలొచనలొ
పడిన అయ్యప్ప స్వామి ముక్కున వెలు వెసుకొనెన్."

1 comment:

రాధిక said...

baagunnayi.naaku ramaadevini etula pilaavalani anna puuranam baaga nachindi