Monday, November 13, 2006

తలను మరిచిన తండ్రికి తలవంచి వందనమిడె తనయుడు!

బ్రతుకాడిన చదరంగాన పావుగా మిగిలి, ఇచ్చిన మాటకై,
రాజ్యము, భొజ్యము, రాచరికపు భూషనములు మహర్షి కొదిలి,
తనతోను తల్లితోనూ కానల కొచ్చియు, తానొచ్చిన బాటపై చిన్
తలను మరచిన తండ్రికి తలవంచి వందనమిడె తనయుడు!!

======================================

రాత్రనక పగలనక కాయ కశ్టము పనులు చేస్తూ
తన చెమటను ఇంధనముగ బ్రతుకు బండిని నడుపుకొస్తూ
అమ్మ రోగము నయము చెస్తూ, మురిపాలను తనకు పంచుతూ
చిరుగుల అంగీ తను తొడిగి, బోసినవ్వులు నవ్వుకుంతూ, నుదుటి మడ
తలను మరచిన తండ్రికి తలవంచి వందనమిడె తనయుడు

=======================================
"అల దివి నుండి ఇల చేరిన మేనక,
ఋషి తపభంగమొనరించి కన్న బాలను,
వలపించి మనువాడి, అభిజ్ఞానమిచ్చి
శాపవశముచే మమ్ము మరిచితివీవు!

కలను గూడ వాడని నీ తలపు తో నిరతము వగచుచు నా తల్లి,
మేలగు విద్యలందు నీకు వారసుని గా మేటి వీరుని చేసినది
ఇలను" అని అలనాటి జ్ఞాపిక చూపి, తన తల్లి యగు శకుం
తలను మరిచిన తండ్రికి తలవంచి వందనమిడె తనయుడు!!

(అభిజ్ఞాన శాకుంతలం)
=============================

విధి కాటుకు బలియైన సతి రూపము
మదిని తలచి విలపి౦చే తరుణాన,
పారాడే తన పాపడి పాలుగారు మోము చూచి,
నేనున్నా నీక౦టూ చేరదీసి, అక్కున చేర్చి....

అమ్మగా లాలి౦చి, ఆప్యాయ౦గా పె౦చి, అన్నితానై నిలిచి,
మారు మనువు ఊసు తన మనసు తలుపు తెరువనీక,
పసినవ్వుల పరవశాన కలతలనే కాక వనితలను
మరచిన త౦డ్రికి తలవ౦చి వ౦దనమిడె తనయుడు.

No comments: