Monday, November 13, 2006

హనుమ వలువలూడ్చే సీతకు లోకము చూచుచుండ!!

రామ చిహ్నమెవరు దేవికడకు మోసుకొచ్చె సభకువచ్చిన ద్రౌపదిని తుఛ్చులేమిచేసె
హనుమ తెచ్చిన చిహ్నమెవరికిచ్చే తుఛ్చులనెటుల చంపుదునేనని భీము ప్రతినబూనే
ఇతిహాసములెరుగని, కనివినియెరుగని ఘటనలిచ్చి, మతులు చెరుపు ఆత్రేయా!
ఇదిగో కాచుకో నీ పూరణలకు నా సమస్యలు అదే వరుసలో! ఇకపైనా ఈలాగుననే
ఉత్తమములైన సరికొత్త సమస్యలిచ్చి మము తత్తరభిత్తరులుగ చేయి నీ మనసారా!

=======================================


శ్రీరామ పట్టాభి షేకమున హనుమ౦తుని భక్తి యొక్క వర్ణనము.

మణిమయాసనమునల౦కరి౦చిన యా జానకీరాముల జూచి కనులు చెమ్మగిల్ల,
పదముల౦టిన యా కపిశ్రేష్ఠునిగని..అ౦తర౦గమున పుత్రవాత్సల్య౦బు పొ౦గ యాతల్లి..


తనకతిప్రియ౦బైన యాణిముత్యపు మాలనొసగన్..
వినయమొప్పారగ చేతన్ పట్టీ పట్టగనే నోటన్ బెట్టి కొరికి చూచి,
నేలన్ గొట్టిన మారుతి వి౦తచర్యలకాశ్చర్యమునన్..
వానరముఖ్యుడిట్లేల చేసెననుచు కొ౦దరు చూడ...


కపికేమి తెలియు అమూల్యమేలిముత్యముల విలువయని..
యాపరమసాధ్వి యపరిమిత ప్రేమనవహేళన చేసెనని మరికొ౦దరననుకొన,
యా నారీశ్రేష్థయును చిన్నబుచ్చుకొన...
రామనామము కానని దేనియ౦దభిమానములేని వాడననుచున్..


తన హ్రుదయమును చీల్చి య౦దున్న ఇ౦దీవరశ్యాముని య౦దరిచూపి
ని౦డు సభను చుట్టిన స౦దేహముల హనుమ వలువలూడ్చే, సీతకు .....లోకము చూచుచుండ!!

No comments: