పోకిరి, పౌర్నమి, చక్రం, టాగొరె చిత్రాల పేరులను వాడి, రామాయణ సంబంధమైన పూరణ చేయండి
రామాయణ యుద్ధ౦లో మేఘనాధుడు కూడా మరణి౦చిన సమయ౦లో విభీషణుడు తన మనసులో ఈవిధ౦గా అనుకున్నాడు......
మహాదేవు మెప్పి౦చి యమోఘమౌ వరముల౦దిన యాతపోకిరీటి మది పోకిరి యై కోరెను విష్ణుపత్నిన్..
ని౦డు పౌర్ణమి వలె మును భాసిల్లిన ల౦కానగర సామ్రాజ్య విభవ౦బు నేడు వెలవెల పోయెన్..
ఎ౦త వారలైన, మోహ౦బున పరకా౦తల కోరి తప్పి౦చుకొన వీలే కాల చక్రమున్...
రావణుడేల నకటాగోరె సీతననుచు విభీషణు౦డు వగచెన్!
=======================================
భరతుడు రాముని అడవికి పంపి తనకి పట్టాభిషేకము
చేస్తారన్న మాట విని ఇట్లా అనుకున్నాడు.
కాల చక్రము నా మీద నిక్కముగ పగ పట్టే! అకటా నిది
మాత ముఖమున బయల్వడిన మందర విష పూరిత తలపో!
కిరీటము నా తల నిడ ఆమె హృదయమున మొలిచిన కలుపో!
ఔర! నిమిలిత పద్మ నేత్రుని కానలకు పంపుటగోరె కదా?
=================================
పోకిరిగా తరులు దరులు తిరుగుచు, ఒకటియునొదలక, అకటా
గురులు తప్పక నిర్దయుడై పక్షుల జంపెడి వాడును,
రామ మర లకు వ్యత్యాసమెరుగని నాస్తికుడునగు బోయవాడు,
విధి చక్రము తిరిగి, బ్రహ్మ పుత్రుడు జ్ఞానము పోసినంత,
పౌర్ణమి వెన్నెల వలె చల్లగ హృదినాహ్లాదము గలిగించు
రామ చరితను జగతికి అందించె ఆసువుగా ఆదికవియై!!
==============================
సీత చెంత లేని ఈ పౌర్ణమి కూడ అమవస నిశి కాదా యని రామన్న
చల్లని వెన్నెలకటాగురుతుకు తెచ్చుచునది వదినెమ్మ దీవెనలని సౌమిత్రి
కాలచక్రమే పగ బూనినదా దిక్కుకానరాకున్నది యని, సీత జాడ
పాలు పోకిరువురి మానసములు మూగగా రోదించినవి పరి పరి విధముల
No comments:
Post a Comment