Monday, November 13, 2006

ఇలియాన, సదా, త్రీష, చార్మి లను వాడి, ఒక పౌరాణిక కధ మూలంగ, సమస్యని పూరించండి.

ఏవరైతే భూప్రదక్షిణం చేసి అన్ని పుణ్య నదులలో స్నానం చేసి ముందుగా తిరిగి వస్తారో వారికే గణాధిపత్యం లభిస్తుంది అని పందెం పెట్టాడు పరమ శివుడు. కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం మీద బయలుదేరాడు. వినాయకుడు అక్కడే ఉండి తల్లి తండ్రులకు ప్రదక్షిణం చేస్తూ నారాయణ గాయత్రి జపించాడు. దాని ప్రభావంతో కుమార స్వామి ఏ నదికి వెళ్ళితే అక్కడ తన కంటే ముందు స్నానం చేసి వస్తున్న వినాయకుడు కనిపించాడు....

గణాధిపత్యము సాధించ నే సమర్థుడననుచు సంతసిల్లి
యానమునకు మయూరము తో జనిన కార్తికేయుని గని సదా
ప్రసన్న చార్మిళితమౌ మందహాసమొలికించు గుజ్జు రూపుడు
తల్లి దండ్రుల మించు ప్రత్యక్ష దైవము లేదని భక్తి మీర
ప్రదక్షిణ చేసె జపించుచు నారాయణ గాయత్రి,
షణ్ముఖ సోదరుడు వినాయకుడు గణాధిపత్యం పొందగా!

==============================


బాల్య మిత్రునికటుకులు తెచ్చి బిడియపడుచు, రాచ మర్యాదలకు
అబ్బురబడు, సత్సీలత సదాచార్మిళిత సంపన్నుడునగు
సుదాముని, సుందర దరహాస ముఖుదు, గోపీ మానస చొరుడు
గని, వేరొకరిది కాదిదినీ ఇల్లే యన. పారవస్యమున ఒలికిన సుదాము
అశ్రుధారలు, శ్రి కృష్ణుని పాద పద్మములపై పడ, ఆకాశమునుండి
గంగొత్రి, శంకరుని శిరమున పడిన భంగి సభకగుపించే!!


=============================


శ్రీరాముడు వనవాసానికి వెళ్ళే స౦దర్భ౦...

కలనైనా ఎడబాటును సైపలేని సదాచారి మితభాషిణియై....

మణిభూషణముల్ త్యజి౦చి...నారచీరన్ ధరి౦చి..

తానూ తోడుగ వచ్చుననుచు పదముల ప్రణమిలి యానతి

వేడె వినయమునా జనకపుత్రి శా౦తారామున్.

============================

2 comments:

చదువరి said...

తెలుగుబ్లాగు గుంపు గురించి మీకు తెలిసినా మీ బ్లాగు గురించి మీరు అక్కడి సభ్యులకు చెప్పకపోవడం అన్యాయం. ఇలాంటి బ్లాగు నాకు తెలిసి మరోటి లేదు. చాలా సంతోషంగా ఉంది. ఇక తీరుబడిగా చదువుతాను, పాత పూరణల్ని.

కొండూరు కృష్ణ (ఆత్రేయ ) said...

kshaminchandi! i hadly see other blogs. these days i am very busy with my sundarakanda work. thank you very much for your complements. pl. do check other blogs i have also.