Wednesday, December 06, 2006

తల్లిని పెళ్ళికూతురిని చేసి సంబరమున అల్లుడికి కట్టబెట్టె!!!

బుడిబుడి అడుగులతో పడుతూ లేస్తూ,వచ్చీ రాని మాటలతో అమ్మా అంటూ..
చిలిపితనపు అల్లరితో చిందులు వేస్తూ, మారాము చేసినట్టి నిన్నటి ముద్దుల పట్టి,
నేడు మెట్టినింటికి వెళ్ళిపొతుందని మనసులోని బాధ కన్నీరై పొంగినా, చెదరని చిరునవ్వుతో
చేతులార తన చిట్టితల్లిని పెళ్ళికూతురిని చేసి సంబరమున అల్లుడికి కట్టబెట్టె!!!

======================================

సకల సద్గుణ సుందర సుకుమార సౌందరయ వల్లిని,
సమస్త శాస్త్ర వేద వేదాంగ భూషిత కల్ప వల్లిని
శంకర భక్తి తత్వాంతర్గత విలీన సతీ మ తల్లిని
పెళ్ళికూతురిని చేసి సంబరమున అల్లుడికి కట్టబెట్టె
=======================

No comments: