Wednesday, December 06, 2006

వేధింపులకు పొంగి భార్యనక్కున చేర్చెను

చక్కని పండు వెన్నల పచ్చని పల్లె తావు
మెల్లని పిల్ల గాలి చల్లని సెలయేటి జల్లు
తాతలనాటి కిర్రు మంచంపై మల్లెల పక్క
పారాణారని పల్లె పడుచు పెళ్ళామొకపక్క

చుట్టిన వేలి చిలకలను నోటికందించదు..
ఎరుపెక్కిన పాల బుగ్గలను చేతికందించదు..
జడ జాజుల గుబాళింపులను ఆస్వాదించనీయదూ..
తన సిగ్గు మొగ్గలను త్రుంచ వీలుకానీయదు...

తీయని అధరామృతములను ఒకింతొలికించక
ఈ సృంగార రసకేళి న తనది పైచేయి కాగా
రెచ్చిన తన తమకపు వేధింపులకు పొంగి
భార్యనక్కున చేర్చెను తనవోటమి ఒప్పి.

=========================


చక్కని పండు వెన్నల పచ్చని పల్లె తావు
మెల్లని పిల్ల గాలి చల్లని సెలయేటి జల్లు
తాతలనాటి కిర్రు మంచంపై మల్లెల పక్క
పారాణారని పల్లె పడుచు పెళ్ళామొకపక్క
నోటికొచ్చిన తన సన్నని వేళ్ళ చిలకల ని
వేదింపులకు పొంగి భార్యనక్కున చేర్చెనా
గలేక ఆవేళిక తనకప్పటివరకువున్న పట్టువదలి
==================

అధములకేల ఆధిపథ్యమని, ఆలసించిన అధొగతియని...
రొదించిన జనత కళ్ళ ముందు కదలి...పదవే అతనికి పెళ్ళామయ్యె...!
బాధించినా..,దెశ ప్రేమకు లొంగి, రక్తసిక్తమయిన రాజకీయ
వెధింపులకు పొంగి భార్యనక్కున చేర్చెన్‌!!! =====vEturiR

No comments: