Wednesday, December 06, 2006

టాటా, బిర్లా, బిల్లు గేటు, అంబాని లను వారి వారి పేరులా కాక

టాటా, బిర్లా, బిల్లు గేటు, అంబాని లను వారి వారి పేరులా కాక
మరో విధంగా వాడి, పేదవాడి ఆకలిని వర్ణించంది.

తను తిని నాలుగు రోజులైంది తన జీవితాన్ని తిట్టటానికైనా
సత్తువ లేని పరిస్థితి కూలి కోసం తిరగని వీధి లేదు
ఆలిదొక గల్లీ తనదొక గల్లీ బిచ్చమెత్తే మనుషులు కారు
గాలి తిని పలావునూహించుకుంటూ నీరు తాగి బీర్లాగనుకుంటూ
తిరిగి తిరిగి అలసి గుడిసె దారి పట్టి
గుడిసె కప్పు లోనించి వస్తున్న పొగలు చూసి
ఉన్న గుడిసె కూడ పోయిందన్న ఆతురతతో
ముఖంలో నెత్తురు చుక్క కరువైంది ,గుండె గుబేలు
గేటు తీసి త్వర త్వరగా లోనకెళ్ళి గంజి కాస్తున్న భార్యను చూసి
తినటానికి కాస్త గంజినిచ్చిన దేవుడికి మొక్కుతుంటే,
వీడ్ని పరిక్షించటానికా అన్నట్లు అంబాని ఆకలిగొన్న ఆవు పిలుపు
తన గంజిలోనే మరికాస్త నీరు పోసి కుడితి పట్టించాడు మన పేద జీవి!!
నమ్మిన వాళ్ళనే దేవుడెందుకు పరీక్షిస్తాడు?
==============================

మాసిన గుడ్డల్థొ వేడి వేడి బిర్యని
order చెయ్యాలని hotelకి వెళ్తే
ముందు billuకి డబ్బులున్నయ అంటూ
గట్టు వరకు నెట్టాడు బేరరు
ఇల్ల కాదని పాలవాడి దగ్గరకెళ్దామంటే
అమబాని అరిచే ఆవు కుద పులిల గాండ్రిస్తుందా
అని భయం చుస్తె తాతల నాటి నుంచి
నేథులు తాగిన వంశమె కాని
బిర్లగులని తిని చెడిన వంశం కాదు.

No comments: