Monday, October 16, 2006

కుంతీ! సుతులు రావణుడు కుంభకర్ణుడు

దుర్యోధన దుశ్శాసనుల పై ఎంత పుత్రవాత్సల్యం ఉన్నా గాని, ద్రౌపదీ వస్త్రాపహరణ సంఘటన మాత్రం, ఒక స్త్రీ గా సహించ లేక పోయింది గాంధారి దేవి. తనలోని వేదనను పురుషుడైన తన భర్త తో చెప్పుకోలేక, కోడలికి జరిగిన అన్యాయానికి కుమిలిపోతున్న కుంతీ దేవి తో తన లోని బాధను పంచుకుంటూ.. ఇలా అన్నది..

అంతే లేని ఆగడాల మితిమీరి నిండు సభలో

ఇంతి వలువలూడ్పించి పాప భీతి యన్నది

కొంతైనా లేని నా పుత్రాధములనేమని చెప్పుదు

కుంతీ! సుతులు రావణుడు కుంభకర్ణుడు

================



పాండు సతి ఎవరు, అతని సొత్తు లేమి
సీత దోషి ఎవరు, అతని రాసి ఏమి
రాధేయుడెవదన్న, సమాధాన ఝరి,
కుంతి, సుతులు, రావణుదు, కుంభ, కర్నుడు

No comments: