Monday, October 23, 2006

మావటి ఆకలి వేసి ఏనుగు మేసెను

కానలనుండు కరి వీధిలో విన్యాసములు చేసెను
కనులప్పగించి ప్రేక్షక వాహిని అచ్చెరువుతో చూసెను!
అలసిన దాని ముందు చెరుకులు రాశిగ పోసెను
మావటి, ఆకలి వేసి ఏనుగు మేసెను!

====================

మరుగుతున్న నెత్తురొచ్చి తాత తెలివిని వెక్కిరించె
మమ్మీ డాడీ చదువులొచ్చి వేద పఠనం వుట్టి కెత్తె
మారుతున్న కాలంతొ ఈ జగతిన మారనిదేది లేదయ్యే
మరలి చూస్తే, కంచే చేను మేసెనన్న సామెత పాతదయ్యె
మరి వచ్చే, "మావటి ఆకలి వేసి ఏనుగు మేసెను "
============================

ప్రతి రొజూ అలుపేరుగక సాములు చేస్తూ
బక్క చిక్కిన చిన్ని ఏనుగు తొ విన్యాసాలు చేస్తూ
నీరు త్రాగి పొట్ట నింపే మావటి ఆకలేసి
ఏనుగు మేసెను ఎప్పటి వలే తన మావటి కన్నెళ్ళను!!

=========================

బోఫోర్సని దేశ భక్షణ మంత్రులు దేశన్ని దోస్తున్నారు
ఇంటి వాసాలు లెఖ్ఖించి ఇల్లు నాదని కేసులేస్తున్నారు
నిరుపేదలు బ్రతక లేక అన్నలుగా అవతారాలెత్తుతున్నారు
మన దేశమున్న దుర్భర పరిస్థితికి ఇదొ తార్కాణం
ఆకలేసిన నిరుపేద మావటి దేసాన్ని ముంచలేదు
అన్నగా మారి దేసాన్ని దుమ్మేత్తి పొయ్యలేదు
నీరు దొరకని ఎడారి వాసులు, బ్రతుకు నిలుపుటకు వొంటెను చంపటంలే?
చిన్న చేపను పెద్దచేప ఆ చేపను మరి పెద్ద చేప
సాంఘిక న్యాయమే, మావటి ఆకలి వేసి ఏనుగు మేసెను
తప్పులేదు మావటి, నా హ్రుదయంతరాళలొనించి నీకు నా సానుభూతి

No comments: